Saturday 24 March 2018

అస్తమించిన సూర్యుడు @ శృంగవరపు రచన

అస్తమించిన సూర్యుడు
@ శృంగవరపు రచన 

ఇష్టం-అయిష్టం అన్నవి లేవు జీవితమున ....
ప్రవృత్తి -ప్రవృత్తి చిరుదరహాసాలు చిందించవు చేరువ చెంతన...
నా జీవితం-నా తోవ అన్న మాటలెప్పుడో అంతరించె
జీతమెంత అని అడిగేవారే కానీ ...
ఆత్మ జ్యోతి నిన్నెందుకు వీడింది అని ఆదుర్దాపడ్డవారే లేరే!
ఆరడుగుల దేహంలో అణువణువున ప్రేమతో నర్తించే...
ఆ చిట్టి హృదయ స్పందన నేడు చిన్నబోయిందే!!
కాసులతో ఉదయం ఊగినప్పుడు తందానా అన్నవారు...
బాలభానుడి స్పర్శతో సాపాటు గడుపుకున్నవారు..
తూర్పు నుండి పడమర మళ్ళగానే శని లా చూస్తారే ?
నాయకుడి తేజస్సు తగ్గినా కురువృద్ధుడు కాలేదే...
నాయకి హోయలు క్షీణించినా దాసి అవ్వలేదే ....
నాంది వచనం ఇంకా భరతవాక్యం కాలేదే!!
నాటి లక్ష్మీ కటాక్ష పిల్లన గ్రోవి నేడు పనికిరాని కర్రముక్కయ్యిందా?
నాటి కామధేనువు నేడు వట్టిపోయిందా??
చరమాంకంలోని చర్మం అశ్రుకణాలనే కానీ...
సొమ్ముల వర్షాన్ని కురిపించలేదనేగా ఆ కినుక?
మనుషుల రాత మొదలయ్యేది ముగిసేది...
నగదు నర్తింపు తోనే కానీ నలిగిపోయే మనసుల వ్యధలో కాదు!
అస్తమించే సూర్యుడు ఆకాశంలో తప్ప
భూమిపై ఎప్పటికీ ఉదయించడు!!

Thursday 22 March 2018

@ విన్నింగ్ మైండ్స్ -శృంగవరపు రచన

YOU  ARE  A WINNER 
@ విన్నింగ్  మైండ్స్ -శృంగవరపు  రచన

    మీరూ  అసలు  ప్రయత్నించలేదని   విమర్శిస్తే  సద్విమర్శ....
ప్రయత్నిస్తున్నప్పుడు  తెగిడారంటే   అది  కువిమర్శ..
ప్రపంచానికి...మనిషికి..దేనికైనా   సక్సెస్  ఫార్ములా..ఒక్కటే!!
అదే   ప్రయత్నం ...
ఆ  తర్వాత   మన ప్రయత్నం   ఆమోదం  పొందని వారి  కుసంస్కారంతో   పోరాటం...
మానసిక  స్దైర్యాన్ని   దెబ్బతీసే   ఆ  విషపు  తోడేళ్ళు...
మీ   ఓటమిని   చూసి  ముసలి  కన్నీళ్ళు..గెలుపును  చూసి  విషపు   హాలాహలాలు  కక్కుతాయి!!
జ్ఞానం,తెలివి,సంస్కారం,విలువలు   మన  అంతస్తులను  నిర్మిస్తున్నప్పుడు....
మన కష్టం  సక్సెస్ గా  మారకుండా  ఎలా  ఉంటుంది!!
రానివ్వండి  ఆ   తోడేళ్ళను....
గెలిచేవాడినే  గమనిస్తూ  నీరుగారుస్తారు   తప్ప  అసలు  ప్రయత్నించని  వాడిని  కాదు...
బ్రేవో  కామ్రేడ్  ...YOU  ARE  A  WINNER!!

కర్మ సిద్ధాంతం Article Published in Andhra Patrika (Manasa Maatladu) on 22 March 2018


Sunday 18 March 2018

గెలుపే గమ్యం.. @ శృంగవరపు రచన

గెలుపే   గమ్యం..
@ శృంగవరపు  రచన

    ఓటమి   నీ    భ్రమ.....
     గెలుపే   నిర్ధారించబడిన   నిజం.....
     ఎందుకో    తెలుసా???
    నీలో   బాధ   జ్వలిస్తుందంటే   నువ్వూ   పోరాడుతున్నావని.....
  యుద్ధం   చేయమని   పార్ధసారధి    అంటే    విషయ వ్యామోహంలో  పడి   పార్దుడు  ఓ   క్షణం  ఆలోచించాడు....
  ఓడిపోతానన్న   భయంతో   కాదు....
చెడ్డవాడినన్న   నింద  భరించాల్సివస్తుందేమోనని....
నీ   జీవిత పోరాట   సూత్రం  నీ  సొంతం.... 
నీ  జీవిత  గెలుపు   మార్గాన్ని  నిర్ధేశించే    సైంటిస్టువి   నీవే....
నీకు   నీవే   ఎడిసన్ ,ఐన్ స్టీన్ ....
భయమెందుకు???
వేరోకరి    సక్సెస్  ఫార్ములా   మనది  కాదు....
గెలుపు   గమ్యం  మనది  కానీ   చెప్పే వారిది   కాదు....
సక్సెస్   అంటే   ఆగకుండా    సాగిపోవడమే!!!
మీ ....గమ్యం   అదే!!!

ఒక విజయవంతమైన భర్త అవడం ఎలా | How to be a Successful Husband video uploaded in YouTube By Eagle Media Works on 18 March 2018


పరమాత్మలో లీనం Article Published in Andhra Patrika (Manasa Maatladu) on 18 March 2018


నిర్దిష్ట లక్ష్యమే విజయానికి మార్గం Published in VAARTHA Sunday Magazine on 18 March 2018




Saturday 17 March 2018

విడువకు నా చేయి.... @ శృంగవరపు రచన

విడువకు   నా   చేయి....
@ శృంగవరపు  రచన 

   స్టేషన్ లో  ఒంటరినై  ఎవరూ  లేక   నిస్పృహతో   ఉన్నప్పుడు.....
   ఓ  పక్కగా  ఉండి   చూస్తున్న   నీవు   నన్ను  రమ్మని   పిలిచావూ   కదూ.....
   నేను  సందేహించాను  నీవూ   కూడా   ఈ  లోకం లానే  నన్ను   దగా   చేస్తావేమోనని....
   అందరూ   నా  చేతిని  స్పృశించ  చూస్తే   నీవు  మాత్రం.....
   నా  మెదడును  మనసును   తాకావు....
    ఈ లోపు   ఎవరో   వచ్చారు   స్టేషన్ కు  నన్ను  తీసుకెళ్ళడానికి...
   నన్ను   కూడా   రానివ్వవు అని  నీవూ   ఆర్ధ్రతతో  నా  మనసులోకి   చూసిన  ఆ క్షణం.....
నా   కన్నీరు ఆర్ధ్రతను   ముద్దాడిన  ఆ   క్షణం....
నిన్ను   నా  గుండెలకు హత్తుకోవాలనిపించింది....
   నిస్సహాయంగా  నిన్ను  వదిలిన  ఆ  క్షణం...
  నా మనసు  నన్ను  గట్టిగా  తన్నినట్టనిపించింది....
   ఇంటికొచ్చాక   నిన్ను  మర్చిపోయాను...
 ఒంటరినవగానే  మళ్ళీ గుర్తొచ్చావూ....
   అనుకోగానే   ఓ  షెల్ఫ్ లో   ప్రత్యక్షమయ్యావూ....
   నాకు   బోలెడు   కుటీరాలున్నాయి...రాకూడదు  అని  పిలిచావూ...
    నిన్ను  వెతుక్కుంటూ   క్రాస్ వర్డ్ కు   వచ్చాను....
    నీ పైన   ధర  పెట్టారు...
    అయినా   నవ్వుతూ  నా   వైపే  చూస్తున్న   నీతో   అప్పటికే   ప్రేమలో   పడిపోయాను....
    డబ్బులు   లేవు   నా   దగ్గర....
   అంతేనా....నన్ను   దగ్గరికి   తీసుకోవా...సాకులతో   వదిలించుకుంటావా....అని  బాధతో  నీవు   చూసిన  క్షణం...
   వెంటనే  ఇంటికి  పరిగెత్తుకుంటూ  వెళ్ళి  డబ్బులు   తెచ్చి  నిన్ను   సొంతం   చేసుకున్నాను....
    రిటర్న్  జర్నీ   నీతో   ఓ  అందమైన   జ్ఞాపకం....
    కలిసిన  ప్రతీ సారీ   నీతో   రమించడం  ...నువ్వూ  నాలో   ఐక్యమైపోవడం....
    కానీ   ఫోన్ లూ.....ఫ్రెండ్ లు...ఫేస్ బుక్ లు...వాట్సప్ లు...నిన్ను  దూరం  చేస్తుంటే...
   నా   నిర్లక్ష్యాన్ని   కూడా   మౌనంగా  భరించావూ....
    హస్త భూషణమా....ఓ   పుస్తకమా...మరల   వచ్చేయ్యవూ....
 అదిగో...సారీ  చెప్పేస్తున్నాగా......
నా  చేయి  విడువకే!!!!

ఇలాంటి పుస్తకం అస్సలు మిస్ అవ్వకండి | Mocking Bird Book Video uploaded in YouTube By Eagle Media Works on 17 March 2018


చైతన్య స్థితులు Article Published in Andhra Patrika (Manasa Maatladu) on 17 March 2018


Friday 16 March 2018

నేనే రాజు...నేనే మంత్రి!! @ శృంగవరపు రచన

నేనే  రాజు...నేనే  మంత్రి!!
@ శృంగవరపు   రచన

  అదో   కోట....
  అక్కడో   రాజు....
  కష్టం  ఎదురైనప్పుడు,నిస్సహాయత   చుట్టుముట్టినప్పుడు....
ఓ   అతీత  శక్తి  సాయం  చేసి  కాపాడేది....
మా  రాజు  వీరుడు,శూరుడు,మంచితనపు   మకరందం  అన్న   ప్రజల  స్వరాల్లో  సరిగమలకు   పులకించాడు   రాజు...
సాయం  చేసిన  ఆ  అతీత  అమృతమూర్తి ఎప్పుడు  గుర్తొచ్చేది....
ఆ  శక్తి  లేకపోతే   తనకు  యుక్తే  లేదనుకున్నాడు...
రోజు   పూజించి,మంత్రిని  చేసి  భక్తిని  ప్రకటించుకున్నాడు...
అతి వినమ్రతతో  మంత్రి పట్ల విధేయత  ఎల్లప్పుడు   ప్రకటించేవాడు....
క్రమంగా   ప్రజలు  మంత్రిలోనే  రాజును  చూసుకుంటున్నారు..
మంత్రికి  బానిసైపోయాడు  రాజు...
రాణికి  ఇదేం  నచ్చలేదు...
రాజు  రాజే...మంత్రి  మంత్రే  అంది!!
మంత్రి   అప్పటికే  తనే  రాజు అని ప్రకటించుకున్న  వార్త  రాజుకు   తెలిసింది....
రాజు-మంత్రి   యుద్ధం మొదలైంది...
రాణితో   కలిసి  యుద్ధంలో  గెలిచి  మంత్రిని  క్షమించి....
మంత్రికి   బాధ్యతలు  అప్పగించి..అధీనంలో ఉంచుకున్నాడు!!
మనపై  ప్రభావాలే  మొదటి  రాజు....
వాటిని   మోస్తూ....
ఆ   నివాసానికి  మనసనే  పేరిచ్చి....
నా  మనసు  ఒప్పుకోదు అని ఆగిపోయే  స్ధితికి  తీసుకురావడమే   ఆ  మంత్రి  పని....
మన  నిజమైన  ఇష్టాలే  రాణి..
నా మనసు   ఒప్పుకోదు   అన్న  ట్రాష్ కి   గుడ్ బాయ్  చెప్పేద్దాం!!!
ఇక  నేనే  రాజు....నేనే  మంత్రి...అని  గట్టిగా  తీర్మానించేసుకుందాం.....ఏమంటారు??

Thursday 15 March 2018

ప్రేమలో పడండి....ఒకరితో కాదు!! @ శృంగవరపు రచన

ప్రేమలో   పడండి....ఒకరితో  కాదు!!
@ శృంగవరపు  రచన

  ఆనందంగా   ఆత్మవిశ్వాసంతో   గుండెను ఆరోగ్యంగా   ఉంచుకోవాలంటే  ప్రేమలో   పడాలి...ఒకరితో   కాదు...ఎంతో మందితో!!!
స్టేట్ మెంట్   ఏంటీ   ఇలా   ఉంది   అని  ఆలోచిస్తున్నారా......అవునండీ   నిజమే !!!
    కూసింత  రాసేది....కాసింత  మాట్లాడేది...బోలెడంత  పని  చేసేది  ఎందుకు  చెప్పండి!!!!???
    ప్రేమ జల్లులతో   చిలకరించబడడానికేగా....!!
ప్రేమ,గీమ   పక్కన  పెట్టేశాం....ప్రేమ  కన్నా   విజయం   ముఖ్యం   అంటారా???
మనల్ని నలుగురు  గుర్తించడం...కాస్త  అభినందించడం...మన   భావాల   వ్యక్తీకరణకై  ఎదురుచూడడం...ఇదేగా   విజయం అంటే!!!
కానీ  నిజం   చెప్పనా???
కొత్తలో   కొత్తదనం   వల్ల   అందరి  భావాలు  నచ్చుతాయి...
స్పందించే  తీరు  చాలా  బావుంటుంది...
మనం   ఎప్పటికీ   ఆ స్పందనల్లో    మన   ప్రతిభను  చూసుకుని   దానిలో   ప్రేమలో   పడిపోతాం...
నిజానికి ప్రేమలో  ఎప్పడు   మనం   వ్యక్తులతో   పడం...
మన  మీద  వారు  వ్యక్తపరిచే   భావాలతో  పడతాం...
అలా   వచ్చే   వ్యక్తుల   ఒక్కో   భావంలో  మనల్ని   మనం  'మల్టిపుల్   పర్సన్ 'ను  చేసేసుకుని   పద్దాక  మనతో  మనమే   ఎందుకు  ప్రేమలో  పడకూడదు!??
 లాభం   ఏంటంటారా??
నిరుత్సాహం....ఒంటరితనం......న్యూనత  దరిచేరినప్పుడు...
మనల్ని   అన్ని  భావాలతో  గొప్పగా   చూపిన  ఈ ప్రపంచ  అద్దాన్ని....
వేల  వేల  కోణాల్లో  ...
ప్రతి   అభినందన  స్పర్శలో   మనలో   ఉన్న   వేల  వ్యక్తులను   తెచ్చేసి   ప్రేమలో   పడితే...
మనకు   మనమే   అభిమానులం...
అప్పుడు    ఎప్పుడైనా   ....
మిగిలిన   వ్యక్తుల  వల్ల  మనం బాధపడతామా   చెప్పండి!!!
ఇదే   మరి  'సెల్ఫ్  సక్సెస్ రూటూ!!'
మరి   పడిపోతారా   ప్రేమలో!!!

అద్వైత సాక్షాత్కారం Article Published in Andhra Patrika (Manasa Maatladu) on 15 March 2018


Wednesday 14 March 2018

ఆత్మా పరమాత్మల సంయోగం Article Published in Andhra Patrika (Manasa Maatladu) on 14 March 2018


ఉద్యోగినికి సమిష్టి ప్రోత్సాహం అవసరం Article Published in VAARTHA MAIN (Cheli page) on 14 March 2018



కవి మిత్రుల్లారా....ప్లీజ్ ..... నన్ను క్షమించరూ...!!! @ శృంగవరపు రచన

కవి  మిత్రుల్లారా....ప్లీజ్ .....
    నన్ను   క్షమించరూ...!!!
      @ శృంగవరపు  రచన

   మిమ్మల్నే  ....అదేనండి  నా  అక్షరాలను  మీ కళ్ళతో,మనసుతో   సత్కరిస్తున్న   మిమ్మల్నే....అడిగేస్తున్నా  క్షమించమనీ!!!
   కారణాలు   చెప్పనా....చెప్పనా....
   కవిత   కూడు   పెడుతుందా?? ఇంకొకరి  కవితకు  స్పందిస్తే   టాక్స్   తగ్గుతుందా??
    విజ్ఞానాన్ని  పంచితే   మిగిలిన రంగాలలో  జీతం,పట్టం  ఉంటాయి...కానీ  సాహిత్యంలో  సంతృప్తే  కొలమానం!!
   అమ్మా...ఆకలేస్తుంది...అనే   బుడ్డోడు  ....
నాన్న...ఇటూ  రావూ...అనే  చిన్నారి...
'ఏమోయ్  ఎప్పటికీ   పూర్తవుతుంది??ఎప్పుడు  లేటే  'అనే  బాసు   ఇంకో   వైపూ...
బాధలు...బాధ్యతలు...ఒత్తిళ్ళు....తప్పనిసరి   పనులు...
ఇన్ని   ఉన్నప్పటికీ   ఒక్కో   ఆలోచనతో   ....కొన్నిసార్లు  సమస్యల్నీ...మరికొన్నిసార్లు   అనుభూతుల్ని...ఇలా  ఎన్నెన్నో   అక్షరాల అనుబంధంతో   నా  మనసుపై   సంతకం  చేసే   మీ   భావ ప్రజ్ఞకు   స్పందన  తెలుపలేని  స్థితికి   నన్ను  క్షమించరూ....
  ఏంటో ...మరీ   విడ్డూరం  కాకపోతేనూ...ఓ  కామెంట్ పెట్టలేవూ...అని   అంటారు....
   ఓ  కవిత  చదవగానే  ఆ  కవిని  కవితతో   చదవగానే...ఆ  కవిగారి  అన్ని  కవితలు  చదవాలనిపిస్తుంది...అలా  ప్రొఫైల్స్ లో   కవితలు  అన్ని   చదివేంత  తీరిక   చిక్కదు...కొన్ని  చదివేసాక  కామెంట్  మూడ్  కన్నా...ఇంకా   చదవాలన్నా   తపనలో  పడి  స్పందన  నిర్లక్ష్యానికి  గురవుతుంది!!
తీరిక  చిక్కదు  అనే  కన్నా ..తీరికను చిక్కించుకునే   మ అందరిలా హుందాగా   సున్నితంగా   అందర్నీ  స్పందనలతో   పలకరించే  సమతుల్య  మనఃస్థితి  నాకు  ఇంకా  రాలేదనడం సబబేమో !!
  కానీ  ఓ  సారి  మనమందరం  తప్పకుండా  కలుస్తాం   కదూ...
  అయినా  మనమేం   మార్స్ మీద లేము  లెండి...కలవలేకపోవడానికి!!
అప్పుడు  కవితలకే   ప్రాణం   పోసే  మీరందరూ  కవితల గురించి   మాట్లాడుకుంటుంటే   నేను  తప్పకుండా...ఒక్కొక్కరు  రాసిన అంశాలు...ఆలోచనలు...భావాల  గురించి  విశ్లేషిస్తాను  సుమీ!!!
అక్షరాలతో   రమిస్తూ...అక్షరాలతో   స్వేదకదనంలో  యుద్ధం  చేసే   మీ  అందరి   అక్షరాలంటే   నాకు   నిజంగానే  బోలెడు  ప్రేమ  తెలుసునా????!!!
   బావుంది  అన్న  కామెంట్ కు  మించిన  మీ  కవితల గురించి   ఓ  రెండు నిముషాలు  మాట్లాడి   ఈ  అపరాధ  భావనను  ఆ   రోజు  తొలిగించేసుకుంటా   సుమీ!!!

Tuesday 13 March 2018

కోయిలా కూయవే... -శృంగవరపు రచన

*అతనొచ్చాడు*
              -శృంగవరపు  రచన 

పొదిగిన అక్షరాలు   కుదురుగా  ఉండమని  నా  కలాన్ని  కాలంతో   పరిగెత్తిస్తూ  హెచ్చరించాయి...
అలానే   ఉండాలని  ప్రయత్నించాను...
ఆనందాన్ని  నా  అందంగా  మార్చే  అతనొచ్చేవరకు...
అక్షరాలు  అల్లికకు  బ్రేకప్  చెప్పేసి  అతని   చెలిమికై  పోటీ పడ్డాయి...
నాతో   కొత్త  ఇల్లు   కలిసి  కట్టాడు...
తనను  ఆస్తిగా  చూడని   అతనికి   ఆ  ఇల్లు   కూడా  ఆత్మీయ  స్వాగతం   పలికింది.....
అతన్ని   చూసేసి   ఇల్లు  కూడా  చుట్టూ  ఉన్న   మొక్కలతో  చెలిమి  చేసేసింది....
బావుంది   అతనితో....
నాతో   తను  లేనప్పుడు   నన్ను  విజయం   పరిహసించేది....
కన్నీటితో  కలల  సాగు  చేసి   నా  కలల్ని  పండించాడు    అతను....
అతనే  నా   ప్రియుడు...
    అతన్నే   వాగ్భూషణం   అంటారని    అనుకుంటుంటే  విన్నాను!!!!

ఓ ముద్దు పెట్టుకోనివ్వండి* -శృంగవరపు రచన

ఓ  ముద్దు   పెట్టుకోనివ్వండి*
          -శృంగవరపు   రచన

అవును....సరిగానే   చదివారు.....
ఎంతోమంది   తమ జీవితంలో   ఎన్నటికీ   తిరిగిరాని   సమయాన్ని ....
అది  గంటల   తరబడి  అయినా.....
నా   మీద   నమ్మకంతో   నా   మాటలు   నిజంగానే  స్ఫూర్తిని  ఇస్తాయని  నమ్మే ...
వారందరి   నమ్మక మనోఫలకం పై  నన్నో   ముద్దు   పెట్టుకోనివ్వండి...
పనులెన్ని  ఉన్నా   నా  వార్త  కోసం  సమయాన్ని  కేటాయించే   మీడియా  మిత్రుల  ఆత్మీయ స్పర్శ పై  ఓ   ముద్దు  పెట్టుకోనివ్వండి....
ఒక్కసారి  నా  గొంతు   మోగడం   మొదలెట్టాక   వారి   ఆలోచనల్ని,నమ్మకాల్ని,ధైర్యాన్ని   నా  మీద  నమ్మకంగా   పెట్టుబడి  పెట్టి....చివరకు   బోలెడు  ధైర్యం వచ్చిందక్కా   అనే   వారందరి  విజయాన్ని   సున్నితంగా  చుంబించనివ్వండి....
 యాక్టివిటీల్లో    చురుగ్గా   పాల్గొని   విజేతల్లా   నిలబడే   వారి   స్ఫూర్తిని  సున్నితంగా  ఓ  ముద్దుతో   స్పృశించనివ్వండి.....
'నీతో   మేమున్నాం...ఎప్పటికి  ఉంటాం ' అనే   పెద్దల   ఆశీర్వచనాల   అపేక్షను  కూడా   ఓ   ముద్దు  పెట్టుకోనివ్వండి....
ఏం  ఎందుకు   పెట్టుకోనివ్వరు!!!
అవయవాల  పరస్పర  స్పర్శ  కాదు ముద్దంటే   మీరలా  గగ్గొలెట్టడానికి....
అది   ఆలోచనల   స్ఫూర్తిపై  ఓ   సంతకం  సుమీ!!

చైతన్యకేంద్రం Article Published in Andhra Patrika (Manasa Maatladu) on 13 March 2018


Tuesday 13 February 2018

Why we celebrate valentines day (వాలెంటైన్స్ డే అంటే ఏంటి ? ఎందుకు జరుపుకుంటారు ?) Video uploaded in YouTube By Eagle Media Works on 13 February 2018

About Sanitary pads Video uploaded in YouTube By Eagle Media Works on 13 February 2018

After GST RGV. (జి.ఎస్.టి రిలీజ్ అయ్యాక రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏమయిందో తెలుసా ?) Video uploaded in YouTube By Eagle Media Works on 13 February 2018

Tollywood Movie Reviews 2018 (ఈ 5 సినిమాలలో ఏది హిట్టు ఏది ఫట్టు) Video uploaded in YouTube By Eagle Media Works on 13 February 2018

How to learn English Quickly (తొందరగా ఇంగ్లిష్ లో మాట్లాడటం ఎలా) Video uploaded in YouTube By Eagle Media Works on 13 February 2018

MOST VIEWED (All time)