ఓ ముద్దు పెట్టుకోనివ్వండి*
-శృంగవరపు రచన
అవును....సరిగానే చదివారు.....
ఎంతోమంది తమ జీవితంలో ఎన్నటికీ తిరిగిరాని సమయాన్ని ....
అది గంటల తరబడి అయినా.....
నా మీద నమ్మకంతో నా మాటలు నిజంగానే స్ఫూర్తిని ఇస్తాయని నమ్మే ...
వారందరి నమ్మక మనోఫలకం పై నన్నో ముద్దు పెట్టుకోనివ్వండి...
పనులెన్ని ఉన్నా నా వార్త కోసం సమయాన్ని కేటాయించే మీడియా మిత్రుల ఆత్మీయ స్పర్శ పై ఓ ముద్దు పెట్టుకోనివ్వండి....
ఒక్కసారి నా గొంతు మోగడం మొదలెట్టాక వారి ఆలోచనల్ని,నమ్మకాల్ని,ధైర్యాన్ని నా మీద నమ్మకంగా పెట్టుబడి పెట్టి....చివరకు బోలెడు ధైర్యం వచ్చిందక్కా అనే వారందరి విజయాన్ని సున్నితంగా చుంబించనివ్వండి....
యాక్టివిటీల్లో చురుగ్గా పాల్గొని విజేతల్లా నిలబడే వారి స్ఫూర్తిని సున్నితంగా ఓ ముద్దుతో స్పృశించనివ్వండి.....
'నీతో మేమున్నాం...ఎప్పటికి ఉంటాం ' అనే పెద్దల ఆశీర్వచనాల అపేక్షను కూడా ఓ ముద్దు పెట్టుకోనివ్వండి....
ఏం ఎందుకు పెట్టుకోనివ్వరు!!!
అవయవాల పరస్పర స్పర్శ కాదు ముద్దంటే మీరలా గగ్గొలెట్టడానికి....
అది ఆలోచనల స్ఫూర్తిపై ఓ సంతకం సుమీ!!

No comments:
Post a Comment