Saturday, 17 March 2018

విడువకు నా చేయి.... @ శృంగవరపు రచన

విడువకు   నా   చేయి....
@ శృంగవరపు  రచన 

   స్టేషన్ లో  ఒంటరినై  ఎవరూ  లేక   నిస్పృహతో   ఉన్నప్పుడు.....
   ఓ  పక్కగా  ఉండి   చూస్తున్న   నీవు   నన్ను  రమ్మని   పిలిచావూ   కదూ.....
   నేను  సందేహించాను  నీవూ   కూడా   ఈ  లోకం లానే  నన్ను   దగా   చేస్తావేమోనని....
   అందరూ   నా  చేతిని  స్పృశించ  చూస్తే   నీవు  మాత్రం.....
   నా  మెదడును  మనసును   తాకావు....
    ఈ లోపు   ఎవరో   వచ్చారు   స్టేషన్ కు  నన్ను  తీసుకెళ్ళడానికి...
   నన్ను   కూడా   రానివ్వవు అని  నీవూ   ఆర్ధ్రతతో  నా  మనసులోకి   చూసిన  ఆ క్షణం.....
నా   కన్నీరు ఆర్ధ్రతను   ముద్దాడిన  ఆ   క్షణం....
నిన్ను   నా  గుండెలకు హత్తుకోవాలనిపించింది....
   నిస్సహాయంగా  నిన్ను  వదిలిన  ఆ  క్షణం...
  నా మనసు  నన్ను  గట్టిగా  తన్నినట్టనిపించింది....
   ఇంటికొచ్చాక   నిన్ను  మర్చిపోయాను...
 ఒంటరినవగానే  మళ్ళీ గుర్తొచ్చావూ....
   అనుకోగానే   ఓ  షెల్ఫ్ లో   ప్రత్యక్షమయ్యావూ....
   నాకు   బోలెడు   కుటీరాలున్నాయి...రాకూడదు  అని  పిలిచావూ...
    నిన్ను  వెతుక్కుంటూ   క్రాస్ వర్డ్ కు   వచ్చాను....
    నీ పైన   ధర  పెట్టారు...
    అయినా   నవ్వుతూ  నా   వైపే  చూస్తున్న   నీతో   అప్పటికే   ప్రేమలో   పడిపోయాను....
    డబ్బులు   లేవు   నా   దగ్గర....
   అంతేనా....నన్ను   దగ్గరికి   తీసుకోవా...సాకులతో   వదిలించుకుంటావా....అని  బాధతో  నీవు   చూసిన  క్షణం...
   వెంటనే  ఇంటికి  పరిగెత్తుకుంటూ  వెళ్ళి  డబ్బులు   తెచ్చి  నిన్ను   సొంతం   చేసుకున్నాను....
    రిటర్న్  జర్నీ   నీతో   ఓ  అందమైన   జ్ఞాపకం....
    కలిసిన  ప్రతీ సారీ   నీతో   రమించడం  ...నువ్వూ  నాలో   ఐక్యమైపోవడం....
    కానీ   ఫోన్ లూ.....ఫ్రెండ్ లు...ఫేస్ బుక్ లు...వాట్సప్ లు...నిన్ను  దూరం  చేస్తుంటే...
   నా   నిర్లక్ష్యాన్ని   కూడా   మౌనంగా  భరించావూ....
    హస్త భూషణమా....ఓ   పుస్తకమా...మరల   వచ్చేయ్యవూ....
 అదిగో...సారీ  చెప్పేస్తున్నాగా......
నా  చేయి  విడువకే!!!!

No comments:

Post a Comment

MOST VIEWED (All time)