Wednesday, 14 March 2018

కవి మిత్రుల్లారా....ప్లీజ్ ..... నన్ను క్షమించరూ...!!! @ శృంగవరపు రచన

కవి  మిత్రుల్లారా....ప్లీజ్ .....
    నన్ను   క్షమించరూ...!!!
      @ శృంగవరపు  రచన

   మిమ్మల్నే  ....అదేనండి  నా  అక్షరాలను  మీ కళ్ళతో,మనసుతో   సత్కరిస్తున్న   మిమ్మల్నే....అడిగేస్తున్నా  క్షమించమనీ!!!
   కారణాలు   చెప్పనా....చెప్పనా....
   కవిత   కూడు   పెడుతుందా?? ఇంకొకరి  కవితకు  స్పందిస్తే   టాక్స్   తగ్గుతుందా??
    విజ్ఞానాన్ని  పంచితే   మిగిలిన రంగాలలో  జీతం,పట్టం  ఉంటాయి...కానీ  సాహిత్యంలో  సంతృప్తే  కొలమానం!!
   అమ్మా...ఆకలేస్తుంది...అనే   బుడ్డోడు  ....
నాన్న...ఇటూ  రావూ...అనే  చిన్నారి...
'ఏమోయ్  ఎప్పటికీ   పూర్తవుతుంది??ఎప్పుడు  లేటే  'అనే  బాసు   ఇంకో   వైపూ...
బాధలు...బాధ్యతలు...ఒత్తిళ్ళు....తప్పనిసరి   పనులు...
ఇన్ని   ఉన్నప్పటికీ   ఒక్కో   ఆలోచనతో   ....కొన్నిసార్లు  సమస్యల్నీ...మరికొన్నిసార్లు   అనుభూతుల్ని...ఇలా  ఎన్నెన్నో   అక్షరాల అనుబంధంతో   నా  మనసుపై   సంతకం  చేసే   మీ   భావ ప్రజ్ఞకు   స్పందన  తెలుపలేని  స్థితికి   నన్ను  క్షమించరూ....
  ఏంటో ...మరీ   విడ్డూరం  కాకపోతేనూ...ఓ  కామెంట్ పెట్టలేవూ...అని   అంటారు....
   ఓ  కవిత  చదవగానే  ఆ  కవిని  కవితతో   చదవగానే...ఆ  కవిగారి  అన్ని  కవితలు  చదవాలనిపిస్తుంది...అలా  ప్రొఫైల్స్ లో   కవితలు  అన్ని   చదివేంత  తీరిక   చిక్కదు...కొన్ని  చదివేసాక  కామెంట్  మూడ్  కన్నా...ఇంకా   చదవాలన్నా   తపనలో  పడి  స్పందన  నిర్లక్ష్యానికి  గురవుతుంది!!
తీరిక  చిక్కదు  అనే  కన్నా ..తీరికను చిక్కించుకునే   మ అందరిలా హుందాగా   సున్నితంగా   అందర్నీ  స్పందనలతో   పలకరించే  సమతుల్య  మనఃస్థితి  నాకు  ఇంకా  రాలేదనడం సబబేమో !!
  కానీ  ఓ  సారి  మనమందరం  తప్పకుండా  కలుస్తాం   కదూ...
  అయినా  మనమేం   మార్స్ మీద లేము  లెండి...కలవలేకపోవడానికి!!
అప్పుడు  కవితలకే   ప్రాణం   పోసే  మీరందరూ  కవితల గురించి   మాట్లాడుకుంటుంటే   నేను  తప్పకుండా...ఒక్కొక్కరు  రాసిన అంశాలు...ఆలోచనలు...భావాల  గురించి  విశ్లేషిస్తాను  సుమీ!!!
అక్షరాలతో   రమిస్తూ...అక్షరాలతో   స్వేదకదనంలో  యుద్ధం  చేసే   మీ  అందరి   అక్షరాలంటే   నాకు   నిజంగానే  బోలెడు  ప్రేమ  తెలుసునా????!!!
   బావుంది  అన్న  కామెంట్ కు  మించిన  మీ  కవితల గురించి   ఓ  రెండు నిముషాలు  మాట్లాడి   ఈ  అపరాధ  భావనను  ఆ   రోజు  తొలిగించేసుకుంటా   సుమీ!!!

No comments:

Post a Comment

MOST VIEWED (All time)